: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఆంధ్రా, తెలంగాణకు భారీ వర్ష సూచన


గత రెండు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కపోత భరించలేకపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల సమీపంలో అల్పపీడనం ఏర్పడి, అది తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం రేపటికల్లా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయుగుండం ఈ నెల 8 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇలా జరిగితే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పై తుపాను ప్రభావం ఈ నెల 11 నుంచి ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో అండమాన్, నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News