: మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు...ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు


ప్రధాని నరేంద్ర మోడీపై జాతీయ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ భారత్' పేరిట రేడియో కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 15న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసేలా రేడియోలో మోడీ ప్రసంగించారని వారు ఫిర్యాదులో తెలిపారు. రేడియోను ఆశ్రయించడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కాంగ్రెస్ పార్టీ కోరింది.

  • Loading...

More Telugu News