: 30 వేల మందితో ఈ నెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ: కేటీఆర్


30 వేల మందితో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఎల్బీ స్టేడియంలో ఈ నెల 11న నిర్వహించనున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్లీనరీ ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం, పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ప్లీనరీ సమావేశం సందర్భంగా వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు టీఆర్ఎస్ లో చేరుతారని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News