: అభిషేక్ బచ్చన్ తో జత కట్టిన ధోనీ


టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తో జతకట్టాడు. వీరిద్దరూ కలసి సినిమాలో నటిస్తున్నారనుకున్నారా? కాదండీ, ఐఎస్ఎల్ లో చెన్నైయన్ ఎఫ్ సీ జట్టుకు వీరిద్దరూ యజమానులుగా వ్యవహరించనున్నారు. అక్టోబర్ 12 నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రారంభం కానుంది. ఐఎస్ఎల్ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ తో ధోనీ ఒప్పందం కుదుర్చుకున్నారని, అభిషేక్ బచ్చన్ తో పాటు ధోని సహయజమానిగా వ్యవహరిస్తారని లీగ్ నిర్వాకులు ఐఎంజీ-రిలయన్స్ తెలిపారు. కాగా, కేరళ జట్టుకు సచిన్, కోల్ కతా జట్టుకు గంగూలీ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. రెండు నెలలపాటు దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఫుట్ బాల్ పోటీలు అభిమానులను అలరించనున్నాయి.

  • Loading...

More Telugu News