: ముదిరి పాకాన పడ్డ టీఆర్ఎస్, టీడీపీ పోరు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీటీడీపీ బస్సుయాత్ర
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, టీడీపీల పోరు ముదిరి పాకాన పడింది. అధికారం చేతిలో ఉంచుకుని కూడా ప్రతి విషయంలోను తమ అధినేత చంద్రబాబును కేసీఆర్ కార్నర్ చేయడాన్ని టీటీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో, ఇకపై వీలున్నప్పుడల్లా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలని తెలంగాణ టీడీపీ నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే, టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బస్సుయాత్ర చేపట్టాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. 10, 11, 12 తేదీల్లో నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో టీటీడీపీ నేతలు పర్యటించనున్నారు. దీనిలో భాగంగా, ఎండిపోయిన మొక్కజొన్న, పత్తి పంటలను క్షేత్రస్థాయిలో టీటీడీపీ నేతలు పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో రైతులను ఓదార్చడంతో పాటు వారికి ధైర్యం చెప్పాలని వారు నిర్ణయించుకున్నారు.