: రోడ్డు ప్రమాదంలో 'ఎఫ్ 1' మాజీ రేసర్ దుర్మరణం
నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్టు... రెప్పపాటు వేగంతో సర్క్యూట్ ను చుట్టేసే 'ఫార్మలా వన్' పోటీల మాజీ రేసర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 1980-90 మధ్య కాలంలో ఫార్ములా వన్ రేసర్ గా రాణించిన డి సారెసెస్ ప్రయాణిస్తున్న వాహనం కాంక్రీట్ గోడను ఢీ కొట్టడంతో ఆయన మృతి చెందాడు. కాగా, జపాన్ గ్రాండ్ ప్రీ టోర్నీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్రెంచ్ రేసర్ జులెస్ బియాంచి మృత్యువుతో పోరాడుతున్నాడు.