: సచిన్ బాల్యమిత్రుడు రాజేశ్ మృతి


సచిన్ చిన్ననాటి స్నేహితుడు, రాజస్థాన్ రంజీ జట్టు మాజీ ఆటగాడు రాజేశ్ సంఘి (42) కన్నుమూశాడు. సంఘి విహారయాత్ర కోసం మాల్దీవులకు వెళ్ళగా, అక్కడ గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. సంఘి ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనగా, సచిన్ ఎంతో ఆదుకున్నాడు. మిత్రుడి వైద్య ఖర్చులను తానే భరించాడు. సచిన్ నాయకత్వంలోని ముంబై అండర్-15 జట్టులో సంఘి కూడా ఆడాడు. ఆ సమయంలో సచిన్, సంఘి ఓపెనర్లుగా బరిలో దిగేవాళ్ళు. కాగా, సంఘి మృతిపై భారత్ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతను ఇతరులకు సహాయపడే వ్యక్తి అని కొనియాడారు.

  • Loading...

More Telugu News