: భుట్టో కుటుంబం నుంచి రాజకీయాలు నేర్చుకో: ఇమ్రాన్ ఖాన్ కు బిలావల్ సూచన


పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోల కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. దానికి ఇంకా సమయముండగానే, తల్లి మాదిరే ప్రత్యర్థులపై పదునైన వ్యాఖ్యలను సంధిస్తున్నారు. భుట్టో కుటుంబం నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలని ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ కు అతడు సూచించాడు. రాజకీయాలంటే ఆటలు కాదని కూడా ఇమ్రాన్ కు గుర్తు చేశాడు. దేశానికి తర్వాతి ప్రధాని భుట్టో కుటుంబం నుంచే వస్తారని బిలావల్ జోస్యం చెప్పాడు. తన తల్లి పోటీ చేసిన రతేదేరో స్థానం నుంచి 2018లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేందుకు బిలావల్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News