: ఆస్పత్రి నుంచి అరుణ్ జైట్లీ డిశ్చార్జి


కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిన్నపాటి సర్జరీ చేయించుకున్న అరుణ్ జైట్లీ, ఆ తర్వాత శ్వాస సంబంధిత సమస్యలతో సతమతమయ్యారు. దీంతో, ఇటీవలే ఆయన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) లో చేరారు. ఆరోగ్యం కుదుటపడిన నేపథ్యంలో ఆయన సోమవారం ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లిపోయారు. అయితే, ఇంటివద్ద కూడా కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్న జైట్లీ, అనారోగ్యం పూర్తిగా నయమైన తర్వాతే విధులకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News