: మీకు పనేం లేదుగా... స్వచ్ఛ్ భారత్ లో పాల్గొనండి: కాంగ్రెస్ వాదులకు మోడీ పిలుపు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తనదైన శైలి ప్రచారంతో దూసుకుపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పై ఆయన పదునైన బాణాలను సంధిస్తున్నారు. సోమవారం నాటి ప్రచారంలో భాగంగా "మీకు పనేం లేదుగా. మీలో కొందరికి ఇప్పుడు పని ఉన్నా, త్వరలో ఆ పనీ ఉండదు. అంతా కలిసి స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో భాగస్వాములు కండి" అంటూ మోడీ విసిరిన మాటల తూటాలకు ఎలా స్పందించాలో కూడా కాంగ్రెస్ కు అర్థం కావడం లేదు. మహిళా నేత అధీనంలోని పార్టీ పాలనలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన సోనియా గాంధీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి, ఆయన కుటుంబానికి సేవ చేసేందుకే హర్యానా ప్రభుత్వం పరిమితమైందని మోడీ ఆరోపించారు.