: అమితాబ్ తో డ్యాన్సు చేసిన అధికారులకు నోటీసులు


కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) కార్యక్రమంలో పాల్గొన్న ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఆ కార్యక్రమ హోస్టు అమితాబ్ బచ్చన్ తో డ్యాన్సు చేసి సీఎం ఆగ్రహానికి గురయ్యారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన కేబీసీ షో రికార్డింగ్ లో అదనపు కార్యదర్శి ఎంకే రౌత్, జాయింట్ సెక్రటరీ విక్రమ్ సిసోడియా (ఈయన సీఎం రమణ్ సింగ్ పేషీలో ఓఎస్డీ కూడా) పాల్గొన్నారు. ఓ దశలో వీరు వేదికపైకి వెళ్ళి అమితాబ్ తో కలిసి 'మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై' పాటకు ఉత్సాహంగా డ్యాన్సు చేశారు. ఆ ఉత్సాహమే ఇప్పుడు వీరికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీనిపై సీఎం రమణ్ సింగ్ ఆగ్రహించారట. సీఏం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివేక్ చంద్ వీరిద్దరినీ మందలిస్తూ నోటీసులు పంపారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం చేయరాదంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, కేబీసీ రాయ్ పూర్ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు. ఈ ఇరువురు అధికారులపై కొందరు చేసిన ఫిర్యాదుల కారణంగానే సీఎం ఆగ్రహించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News