: కాల్పుల విరమణ ఉల్లంఘనలను విరమించండి: పాక్ కు రాజ్ నాథ్ హెచ్చరిక


కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచే సంస్కృతికి తక్షణమే స్వస్తి చెప్పాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ ను హెచ్చరించారు. ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పట్ల ఇకపై భారత్ ఎంతమాత్రం సహించబోదు. తక్షణమే కాల్పుల విరమణను తప్పక పాటించండి. వాస్తవాలను పాక్ తెలుసుకోవాల్సి ఉంది’ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సోమవారం ఉదయం పాక్ రేంజర్లు భారత సైన్యానికి చెందిన పది ఔట్ పోస్టులపై కాల్పులకు దిగారు. సామాన్య పౌరులున్న ప్రాంతాలపైనా ఈ కాల్పులు ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News