: ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ బిలియన్ డే’ ప్రారంభం!


ఈ-కామర్స్ దేశీ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దీపావళిని పురస్కరించుకుని రూపొందించిన ‘బిగ్ బిలియన్ డే’ సోమవారం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వారం నుంచి కొత్త పథకంపై ప్రచారం సాగించిన ఫ్లిప్ కార్ట్ మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అమెజాన్. కామ్ ప్రకటించిన ‘దివాలి షాపింగ్ ఫెస్ట్’ కు పోటీగానే ఫ్లిప్ కార్ట్ కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం కింద పలు వస్తువులను కేవలం ఒక్క రూపాయికే అందించనుందట. స్మార్ట్ ఫోన్లపై 30 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఇక రూ.15 వేల నుంచి కూడా ల్యాప్ టాప్ లు లభిస్తాయట. బొమ్మలు, ఫ్యాషన్ వస్తువులపై 50 శాతం డిస్కౌంట్ ను అందించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News