: ట్యాంక్ బండ్ పై ఆంధ్రా మహనీయుల విగ్రహాలు తీసివేస్తాం: కేసీఆర్
ఆదివారం రాత్రి తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభా పక్షం, పొలిట్ బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో కేసీఆర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్ బండ్ పై ఉన్న మహనీయుల విగ్రహాల విషయంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్‌బండ్‌పై తమకు అవసరంలేని విగ్రహాలను ఒక పద్ధతి ప్రకారం తీసివేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వారి విగ్రహాలే ఉండాలని.. ఆంధ్రా వారి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని అన్నారు. ఈ విషయంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మొన్ననే జ్ఞానోదయం అయ్యిందని చురక అంటించారు. తెలంగాణలో ఆంధ్రా వారి విగ్రహాలు, ఆంధ్రాలో తెలంగాణ వారి విగ్రహాలు ఉండాలని ఇన్నేళ్లపాటు చంద్రబాబుకు ఎందుకు అనిపించలేదని ఆయన ప్రశ్నించారు.