: నేటి నుంచి హైదరాబాదులో మెట్రోపొలిస్ సదస్సు... 50 దేశాల ప్రతినిధుల హాజరు


11వ మెట్రో పొలిస్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సదస్సుకు హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈరోజు నుంచి హైదరాబాద్ హైటెక్స్ లో జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేందుకు వేదికకు వెళ్లే దారి పొడవునా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సు కావడంతో తెలంగాణ సర్కార్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత ఇనుమడించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు, సిబ్బంది సదస్సు ఏర్పాట్లను, అతిథులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సదస్సు కోసం నగరంలోని 125 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేశారు. పలు రహదారులను రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. సోమవారం నుంచి అక్టోబర్‌ 10 వరకూ జరిగే ఈ సదస్సులో ప్రపంచ నగరాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడంతోపాటూ, సమస్యల పరిష్కారానికి వివిధ నగరాల్లో చేపట్టిన చర్యలను ఒకరికొకరు పంచుకుంటారు.

  • Loading...

More Telugu News