: బుధవారం తిరుమల ఆలయం మూసివేత
బ్రహ్మోత్సవాలు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు వెంకటేశ్వరుడి సన్నిధికి చేరుతున్నారు. ఇప్పటికే క్యూలైన్లలో గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్న భక్తులకు బుధవారం ప్రకృతి మరో దెబ్బ కొట్టనుంది. చంద్రగ్రహణం కారణంగా ఈ బుధవారం శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో, సాధారణ భక్తులకు తొందరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా సోమ, మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక దర్శనాలు, కరెంట్ బుకింగ్, దివ్య దర్శనం టోకెన్లు రద్దు చేశామని జేఈవో ప్రకటించారు.