: ముస్లింలకు ప్రముఖుల బక్రీద్ శుభాకాంక్షలు
ఈద్-ఉల్-అజా (బక్రీద్) సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి, నమ్మకానికి, భక్తి భావానికి ప్రతీకలని ప్రణబ్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలోని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఈ రోజు ఆయన ట్విట్టర్‌లో బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బక్రీద్ పండుగ సమాజంలో ప్రజల మధ్య దయ, సామరస్యాలను పెంపొందిస్తుందని ఆయన తెలిపారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీక అని వారు కొనియాడారు. ఈ పండుగను ముస్లిం సోదరులందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని... అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.