: భర్త సాక్షిగా వివాహితపై అత్యాచారయత్నం
మహబూబ్ నగర్ జిల్లాలో దుశ్చర్య చోటుచేసుకుంది. యువకుల ఆగడాలు మితిమీరిపోయాయి. వనపర్తిలో కొందరు యువకులు ఓ వివాహితపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్న భర్తపై బీరు సీసాతో దాడి చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులంతా స్థానిక బాలానగర్ వాసులే. వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో స్థానికులు వారి ఆగడాలు భరించలేకున్నామని, వారిని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు.