: టీమిండియా నెంబర్ వన్ సాధిస్తుందా?
భారత క్రికెట్ జట్టు వన్డే నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుంటుందా? విండీస్ సిరీస్ రూపంలో టీమిండియా ముంగిటకు బంగారం లాంటి అవకాశం వచ్చింది. దక్షిణాఫ్రికాతో కలసి 113 పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్న టీమిండియా నెంబర్ వన్ గా నిలిచేందుకు ఇదే సరైన తరుణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 8 నుంచి వెస్టిండీస్ తో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా నిలుస్తుంది. ఛాంపియన్స్ టీ20 లీగ్ ను గెలుచుకున్న భారతజట్టు టెస్టుల్లో ఘోరపరాజయాలతో ర్యాంకింగ్ దిగజార్చుకున్న సంగతి తెలిసిందే. సొంతగడ్డమీద సింహాలు అనే పేరు పడిన టీమిండియా జట్టుకు విండీస్ సిరీస్ రూపంలో మంచి అవకాశం వచ్చింది. మరి టీమిండియా అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందా? లేదా? అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.