: నెంబర్ వన్ కు అడుగు దూరంలో కోహ్లీ


భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లికి బంగారం లాంటి అవకాశం వచ్చింది. ర్యాంకింగ్స్ లో కిందకి పడిపోయిన కోహ్లీ వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకునేందుకు మరో అవకాశం వస్తోంది. ఈ నెల 8 నుంచి వెస్టిండీస్ తో జరుగనున్న ఐదు వన్డేల సిరీస్ లో కోహ్లీ రాణిస్తే నెంబర్ వన్ గా మరోసారి నిలుస్తాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీవిలియర్స్, హషిమ్ ఆమ్లా అగ్రస్థానాల్లో కొనసాగుతుండగా, కోహ్లికి డీవిలియర్స్ కేవలం 24 పాయింట్ల దూరంలో ఉన్నాడు. అతని కంటే ఆమ్లాకు కేవలం మూడు పాయింట్లే ఎక్కువ. దీంతో వన్డేల్లో నెంబర్ వన్ స్థానం చేరుకునేందుకు కోహ్లీకి విండీస్ సిరీస్ రూపంలో మంచి అవకాశం వచ్చిందని క్రీడాపండితులు విశ్లేషిస్తున్నారు. వన్డే ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ ధోని 6వ ర్యాంకులోనూ, ఓపెనర్ శిఖర్ ధావన్ 7వ ర్యాంకుతోనూ కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News