: చంద్రబాబు ఆస్తులపై లోకాయుక్తలో పిటిషన్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై లోకాయుక్తలో పిటిషన్ దాఖలు అయింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమంగా ఆస్తులను సంపాదించారని.. ఆ సమయంలో కుటుంబ ఆస్తులు భారీగా పెంచుకున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం శుక్రవారం లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను స్వీకరించిన లోకాయుక్త, విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.