: జమ్మూకాశ్మీర్ కు వాణిజ్య పన్ను మినహాయింపు
వరదలబారిన పడి తీవ్రంగా నష్టపోయిన జమ్మూకాశ్మీర్ వ్యాపారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్ను మినహాయింపు ఇచ్చింది. ఆర్ధికంగా ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో వారు తిరిగి ఆర్ధిక పరిపుష్ఠి సాధించుకుని కుదుటపడేందుకు దోహదం చేసేందుకు మినహాయింపులు ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్థిక మంత్రితో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు.