: మోహన్ భగవత్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయడం తప్పుకాదు: ప్రకాశ్ జవదేకర్


ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రసంగం దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడం తప్పుకాదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడుతూ, దూరదర్శన్ స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న సంస్థ అని, అలాంటి సంస్థ ప్రొఫెషనలిజం చూపాలని తాము భావించామన్నారు. దూరదర్శన్ కార్యకలాపాల్లో కేంద్రం జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. భగవత్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చేయడంలో తప్పేమిటో తనకు తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు. అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. భగవత్ ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News