: ఉద్యమకారులెవరో, కానివారెవరో ప్రజలకు బాగా తెలుసు : కేసీఆర్


ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారులెవరో, కానివారెవరో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. ఎవరో అడిగారని పాలనలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేమని ఆయన అన్నారు. కొన్ని పార్టీల నేతలు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని, ఆచితూచి అడుగేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు గత పాలకులు బాధ్యులని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అధికారం అందలేదనే అసహనంతో విమర్శలు చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకే ప్రత్యేక ఉద్యమం మొదలైందని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం తరువాత విషకౌగిలి నుంచి బయటపడ్డామని ఆయన తెలిపారు. పదవులు తమకు ముఖ్యం కాదని ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీ నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News