: నువ్వెందుకొచ్చావ్?...అసలు నువ్వెందుకొచ్చావ్?
'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో పలు వివాదాలకు కారణమవుతోంది. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జ్ పోతుల సునీతను ఆహ్వానించడంపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు మండిపడ్డారు. స్థానికులు ఆహ్వానిస్తే వచ్చేయడమేనా? ఏ అర్హతతో వచ్చారు? అంటూ ఆమంచి వర్గీయులు సునీతను నిలదీశారు. దీంతో ఆమె మండిపడ్డారు. "మంచి పని చేయడానికి ఎవరి పర్మిషన్ కావాలి? నేను వెళ్లడం కాదు, నువ్వే వెళ్లిపో" అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి విషమిస్తోందని గమనించిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు.