: సరితాదేవి పరిస్థితి అర్థం చేసుకోగలను: మేరీకోమ్
బాక్సర్ సరితాదేవి ఎదుర్కొన్న పరిస్థితిని తాను బాగా అర్థం చేసుకోగలనని ప్రముఖ బాక్సర్, ఆసియా క్రీడల్లో స్వర్ణపతక గ్రహీత మేరీకోమ్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ఉత్తమ ప్రదర్శన చేసిన సరితాదేవి భావోద్వేగాన్ని తాను పూర్తిగా అర్ధం చేసుకున్నానని అన్నారు. అయితే అలాంటి పరిస్థితే తనకు ఎదురైతే విభిన్నంగా స్పందించేదానినని మేరీకోమ్ అభిప్రాయపడ్డారు. సరితాదేవిని 'బాయ్' హెచ్చరించి వదిలేసిన సంగతి తెలిసిందే.