: ఆమె 22 ఏళ్లుగా నన్ను భరిస్తోంది!: ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామాలు తమ 22వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పెళ్లి రోజును పురస్కరించుకుని ఇద్దరూ ఓ హోటల్ లో డిన్నర్ చేశారు. అంతకు ముందురోజు మిషెల్ ఒబామా మాట్లాడుతూ, రేపు ఒబామాను కలుస్తానో లేదో కూడా తెలియదని పేర్కొన్నారు. ఇండియానాలోని ప్రిన్స్ టన్ స్టీలు ఫ్యాక్టరీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా మాట్లాడుతూ, 22 ఏళ్లుగా మిషెల్ తనను ఎంతో ఓపికగా భరిస్తోందని అన్నారు. మొత్తానికి వారిద్దరూ కలసి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు.

  • Loading...

More Telugu News