: చంద్రబాబు సరికొత్త నినాదం... జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం కొత్త నినాదాన్ని అందుకున్నారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన 'అలయ్ బలయ్' కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు నోట సరికొత్త నినాదం వినిపించింది. ప్రసంగం ముగించే ముందు ‘జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్’ అంటూ రెండు రాష్ట్రాల అభివృద్ధి తనకు ప్రాధాన్యమేనని ఆయన ప్రకటించారు. ఇదివరకు ఏ ప్రాంతం వెళితే, ఆ ప్రాంతం నినాదాన్ని వినిపించిన చంద్రబాబు, ఆదివారం రెండు నినాదాలను కలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మునుపటి తీరుకు భిన్నంగా ఆదివారం చంద్రబాబు, తన కొత్త నినాదంతో రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉత్తేజం నింపారు. ఏపీ సీఎంగానే కాక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తనకు రెండు రాష్ట్రాల ప్రజలు ముఖ్యమేనని ప్రకటించిన చంద్రబాబు, కొత్త నినాదాన్ని వినిపించారు.