: రోడ్డు ప్రమాదంలో బెజవాడ మునిసిపల్ అదనపు కమిషనర్ మృతి
ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రాంగోపాల్ మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంగోపాల్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాంగోపాల్ అక్కడికక్కడే మరణించారు.