: పాక్ సైన్యం సహనాన్ని పరీక్షించవద్దు: భారత్ కు ముషార్రఫ్ సూచన


నియంత్రణ రేఖ వెంట నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ సైన్యం సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్, భారత్ కు సూచించారు. ఇప్పటికే పాక్ లో రాజద్రోహం నేరాన్ని ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ పంచన చేరి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నియంత్రణ రేఖ వెంట భారత్ నిత్యం కాల్పుల విరమణకు తిలోదకాలిస్తోంది. ఇది మంచి పద్దతి కాదు. పాక్ సైన్యం సహనాన్ని పరీక్షించే ఈ తరహా చర్యలకు భారత్ స్వస్తి చెప్పాలి’’ అని ఆయన అన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముషార్రఫ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్ ను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఆయన, షరీఫ్ ప్రభుత్వంపైనా విమర్శలు సంధించారు.

  • Loading...

More Telugu News