: నేటి అలయ్ బలయ్ కి హాజరు కానున్న కేసీఆర్, చంద్రబాబు
మరోమారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు ఒకే వేదికపై కనిపించనున్నారు. దీనికి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న అలయ్ బలయ్ వేదికగా నిలవనుంది. ఏటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహిస్తున్న దత్తాత్రేయ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ ఏడాది అలయ్ బలయ్ వేడుకకు హాజరు కావాలని ఆయన చంద్రబాబు, కేసీఆర్ లకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. నేటి ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో మరోమారు చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య కరచాలనం, పరస్పర అభినందనలు, మరో దఫా చర్చలు జరిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.