: 'స్వచ్ఛ్ భారత్'లో అందరూ భాగస్వాములు కావాలి: వెంకయ్యనాయుడు


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరులో జరిగిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీజి కలలుగన్న భారత్ ను సాకారం చేసేందుకే ప్రధాని మోడీ, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన చెప్పారు. దేశ స్వరూప స్వభావాలను మార్చే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News