: కొత్త ఇంటి నిర్మాణానికి చంద్రబాబు నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త ఇంటి నిర్మాణానికి దాదాపుగా సిద్ధమయ్యారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో చంద్రబాబు కుటుంబానికి సొంత ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇంటి స్థానంలోనే కొత్త ఇంటిని నిర్మించేందుకు చంద్రబాబు కుటుంబం నిర్ణయించింది. డిసెంబర్ లో నిర్మాణం మొదలు కానున్నట్లు సమాచారం. మొన్నటిదాకా చంద్రబాబు దంపతులు, కొడుకు లోకేశ్ లే ఆ ఇంటిలో నివాసముండేవారు. లోకేశ్ కు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణితో వివాహమైన నేపథ్యంలో ఆ ఇల్లు కాస్త ఇరుకుగా మారిందట. ఈ కారణంగానే ప్రస్తుతం ఉన్న ఇంటిని కూలగొట్టి, దాని స్థానంలో కొత్త ఇంటిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు కుటుంబం మరో చోటికి మకాం మార్చక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా లేక్ వ్యూ అతిథి గృహంతో పాటు తన కుటుంబం పేరిట ఉన్న ఫామ్ హౌస్ లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News