: నేడు టీఆర్ఎస్ కీలక భేటీ
తెలంగాణ రాష్ట్ర సమితి నేడు కీలక భేటీని నిర్వహించనుంది. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ ఇప్పటిదాకా ఈ తరహా పూర్తి స్థాయి సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. తెలంగాణ భవన్ లో నేటి మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించనున్న ప్లీనరీని అత్యంత ఆర్భాటంగా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. అంతేకాక, త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ వ్యవహరించాల్సిన వ్యూహంపైనా నేతలు దృష్టి పెట్టనున్నారు.