: స్వచ్ఛ్ భారత్ కు యూఎస్ ఎయిడ్, గేట్స్ ఫౌండేషన్ల మద్దతు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈ నెల 2న దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి సామాన్య జనం నుంచి దిగ్గజ కార్పోరేట్ల దాకా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాకు చెందిన యూఎస్ ఎయిడ్ తన వంతు సహకారాన్ని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు బిల్ గేట్స్, తన భార్యతో కలిసి నడుపుతున్న గేట్స్ ఫౌండేషన్ కూడా స్వచ్ఛ్ భారత్ అభియాన్ పై ప్రశంసల జల్లు కురిపించడమే కాక తాను ఆ బృహత్కార్యంలో పాలు పంచుకుంటానంటూ ముందుకొచ్చింది. ఇటీవల అమెరికాలో పర్యటించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ వద్ద చేసిన ప్రసంగమే ఆ రెండు సంస్థలను స్వచ్చ్ భారత్ అభియాన్ వైపు దృష్టి సారించేలా చేశాయట.