: తల్లి కోసం స్వలింగ సంపర్క భాగస్వామిని చంపిన యువకుడు


తల్లికి అపాయం జరుగుతుందేమోననే భయంతో స్వలింగ సంపర్క భాగస్వామిని 18 ఏళ్ల యువకుడు కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అహ్మదాబాద్ బాపునగర్ ప్రాంతంలోని చున్వల్ నగర్ మురికివాడలో ఇద్దరు యువకుల మధ్య ఏడాది కాలంగా స్వలింగ సంపర్క అనుబంధం కొనసాగుతోంది. ఈ విషయం ఆ ఇద్దరిలో ఓ యువకుడి తల్లికి తెలిసింది. దీంతో ఆమె తన కుమారుడ్ని మందలించింది. అంతటితో ఆగకుండా రెండో భాగస్వామిని కూడా మందలించింది. దీంతో అతను దురుసుగా సమాధానమివ్వడంతో ఆమె అతనిని కొట్టింది. దీనికి ఆగ్రహించిన ఆ యువకుడు భాగస్వామి చూస్తుండగానే అతని తల్లిపై తీవ్రంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అతని తల్లిని చంపుతానంటూ నాటుతుపాకీ తెచ్చి బెదిరించాడు. దీంతో అతని భాగస్వామి తల్లిని చంపేస్తాడేమోననే భయంతో అతని చేతిలోని నాటు తుపాకీని లాక్కుని మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అతని స్వలింగ సంపర్క భాగస్వామి మృతి చెందాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడి తల్లిని ఆసుపత్రిలో చేర్చారు.

  • Loading...

More Telugu News