: రాణించిన గంభీర్, ఊతప్ప... కోల్ కతా స్కోర్ 180
చాంపియన్స్ లీగ్ లో భాగంగా బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ చేయాల్సిందిగా కోల్ కతాను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతాకు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (39), గౌతం గంభీర్ (80) శుభారంభమిచ్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాక్వస్ కలిస్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆఖర్లో యూసఫ్ పఠాన్ 20, మనీష్ పాండే 32 పరుగులు చేయడంతో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నేగీ 5, రవీంద్ర జడేజాకు ఒక వికెట్ తో రాణించారు.