: 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయండి: కేసీఆర్
టీఆర్ఎస్ ప్రభుత్వానికి పెనుముప్పుగా పరిణమించిన విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వివిధ విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానించిన తెలంగాణ ఇంధన శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేశారు. 2 వేల మెగావాట్లు కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సంస్థలతో ఈ ఒప్పందాలు దీర్ఘకాలం కొనసాగేలా చూడాలని ఇంధనశాఖ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.