: బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 20 కోట్ల 18లక్షలు
బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీకి భారీ ఆదాయం సమకూరిందని ఈవో గోపాల్ తెలిపారు. ఈ ఏడాది, శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని ఆయన అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి హుండీ ఆదాయం రూ.20.18 కోట్లు వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే, లడ్డూల అమ్మకం ద్వారా 21.27 లక్షలు, వసతి గదుల కేటాయింపు ద్వారా రూ.1.45 కోట్ల ఆదాయం బ్రహోత్సవాల సమయంలో సమకూరిందని చెప్పారు.