: విండీస్ పర్యటనలో తొలి మూడు వన్డేలకు భారత్ జట్టు ఖరారు, కులదీప్ యాదవ్ కు చోటు
వెస్టిండీస్ టూర్ లో తొలి మూడు వన్డేలకు గానూ 14మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలక్టర్లు ఈ రోజు ఎంపిక చేశారు. ఛాంపియన్స్ లీగ్ లో రాణించిన టీనేజ్ సెన్సేషన్ కులదీప్ యాదవ్ కు తాజా జట్టులో చోటు లభించింది. స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చి...ఆ స్థానంలో అమిత్ మిశ్రాను తీసుకున్నారు. అలాగే, సంజూశాంసన్, కరణ్ శర్మ, స్టువర్ట్ బిన్నీ, ధవళ్ కులకర్ణిలకు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. భారత్ జట్టు: ధోనీ, ధావన్, రహానే, కోహ్లీ, రైనా, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, మురళీ విజయ్, జడేజా, అంబటి రాయుడు, భువనేశ్వర్, షమీ, అమిత్ మిశ్రా, కులదీప్ యాదవ్