: ఏవండోయ్, ఇది విన్నారా?... అది బాంబు కాదుట!


ప్రధాని నరేంద్ర మోడీకి స్టాండ్బైగా ఉంచిన విమానంలో గ్రెనేడ్ ఉందంటూ వచ్చిన వార్తలన్నీ వదంతులేనని ఎయిరిండియా స్పష్టం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా నుంచి భారత్ చేరేంతవరకు స్టాండ్ బైగా ఉంచిన ఎయిరిండియా బోయింగ్ 747 విమానంలో గ్రెనేడ్ లాంటి వస్తువు కనిపించిందంటూ ప్రపంచ వ్యాప్తంగా వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో భారత భద్రతా ఏజెన్సీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మోడీకి ప్రాణహాని ఉందంటూ నిఘా సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో గ్రెనేడ్ కథనం ప్రపంచాన్ని విస్మయపరిచింది. ప్రధాని ఆమెరికా పర్యటన ముగిసిన తరువాత ఎయిరిండియా బోయింగ్ 747 విమానాన్ని వాణిజ్యపరమైన అవసరాలకు భారత వైమానికాధికారులు అనుమతించారు. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిన ఆ విమానం అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా జెడ్డాకు వెళ్లింది. అది జెడ్డాలో ల్యాండైన తరువాత అందులో గ్రెనేడ్ ఉందంటూ ఓ అనుమానాస్పద వస్తువును గుర్తించారు. వెంటనే భద్రతాధికారులకు సమాచారమందించారు. దీంతో దీనిని అక్కడే నిలిపి ఉంచాలని, విచారణ కమిటీ వస్తోందని, సిబ్బంది ఎక్కడికీ కదల వద్దని అధికారులు అదేశించారు. దీనిని పరిశీలించి, విచారణ చేసిన అధికారులు ఆఖరికి అది బాంబు కాదని, ప్లాస్టిక్ బ్యాగ్ అని నిర్థారించారు. దీంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News