: హీరో ఆదికి నిశ్చితార్థమైపోయింది
టాలీవుడ్ యువ కథానాయకుడు ఆదికి విజయదశమి రోజున నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ నటులు, పీజే శర్మ మనవడిగా, సాయికుమార్ కుమారుడిగా 'ప్రేమకావాలి' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఆది చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. సీనియర్ నటుడు పీజే శర్మ అనారోగ్యం బారినపడడంతో ఆదికి పెళ్లి చేసేయాలని సాయికుమార్ భావించారు. దీంతో ఆది ప్రేమలో పడిన అరుణ అనే అమ్మాయితో విజయదశమినాడు నిశ్చితార్థం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఆది కుటుంబసభ్యులు, అరుణ కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.