: హాలీవుడ్ హీరోపై లైంగిక దాడి కేసు
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంటూ అతని డెంటల్ టెక్నీషియన్ మార్గరిటా పాలెస్టినో ఫిర్యాదు చేశారు. 49 ఏళ్ల చార్లీ షీన్ సెప్టెంబర్ 25న దంత వైద్యం చేయించుకుంటుండగా, అతని దంతాలకు చికిత్స కోసం వేసిన నైట్రస్ ఆక్సైడ్ మాస్క్ తీసేసి ఛైర్ నుంచి గెంతి ''నేను నిన్ను .... చంపేస్తాను'' అంటూ పట్టుకున్నాడని, తన దుస్తులు విప్పేసేందుకు కూడా షీన్ తీవ్రంగా ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో షీన్ ఎక్కువ మోతాదులో కొకైన్ తీసుకుంటున్నట్టు ఇతర డెంటిస్టులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. లాస్ ఏంజెలిస్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పాలెస్టినో న్యాయవాదులు ఈ ఫిర్యాదు చేశారు. గతంలో షీన్ ఓ డెంటిస్టును కత్తితో బెదిరించి, డెంటల్ ఛైర్ను కత్తితో పొడిచి బెదిరించాడని తెలిపారు. దీనిపై షీన్ న్యాయవాది మాట్లాడుతూ, షీన్ లాంటి సెలబ్రిటీతో గడిపిన కాస్త సమయాన్ని ఇలా క్రేజ్ పెంచుకునేందుకు ఆమె వినియోగించుకుంటోందని, ఆమె అసత్య ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.