: నా పద్యం వాడుకోవడానికి నీకు సిగ్గు లేదా?: శ్రీను వైట్లపై ప్రకాష్ రాజ్ ఫైర్
దర్శకుడు శ్రీను వైట్లపై ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. తాను ప్రెస్ మీట్ లో చెప్పిన పద్యాన్ని వెక్కిరిస్తూ శ్రీను వైట్ల 'ఆగడు' సినిమాలో ఓ సీన్ పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. తను చెప్పిన పద్యాన్ని సినిమాలో వాడుకోవడానికి ఆయనకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. శ్రీను వైట్ల అహంకారం వల్లే 'ఆగడు' అట్టర్ ప్లాప్ అయ్యిందని ఆయన అన్నారు. ఇకనైనా అహంకారం తగ్గించుకోవాలని ఆయన దర్శకుడికి సూచించారు. ప్రేక్షకులను మెప్పించడానికి సినిమా తీయాలి గానీ, వేరేవారి మీద కసి, కక్ష తీర్చుకోవడానికి సినిమా తీస్తే, 'ఆగడు' లాంటి ఫలితమే వస్తుందన్నారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ తోనైనా పద్ధతి మార్చుకుంటే శ్రీను వైట్ల మళ్లీ బాగుపడతాడని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.