: కోర్టుల్లో 'ఛాతి నొప్పి' నాటకాలు ఇకపై చెల్లవు!


అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వెంటనే ఛాతీ నొప్పి వచ్చింది. జైలుకు తరలించాల్సిన ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాక, ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పారు. దీంతో తిరిగి ఆమెను జైలుకు తరలించారు. ఈ తరహా జిత్తులమారి ఎత్తులు ఇకపై కోర్టు ముందు చెల్లనేరవు. తీర్పు వెలువడగానే ఛాతి నొప్పి అంటే, అజీర్తి నుంచి ఉపశమనాన్నిచ్చే ఓ చిన్న మాత్ర ఇచ్చేసి, నేరుగా జైలుకు తరలిస్తారు. ఈ మేరకు కొత్త నిబంధన అమలులోకి రానుంది. ఎందకంటే, మొన్న నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ జయలలిత నుంచి శిబూ సోరెన్, మధు కోడా, బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ తదితరులకంతా... న్యాయమూర్తి శిక్ష గురించి ప్రకటించగానే ఛాతీ నొప్పి వచ్చిందట. ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పారు. దీంతో వారి ఛాతీ నొప్పి అంతా ఉత్తుత్తిదేనని తేలింది. న్యాయమూర్తి ప్రకటించిన శిక్షను జైలు గదిలో కాకుండా ఆస్పత్రి బెడ్ పై అనుభవిద్దామన్న కోణంలోనే ఆయా నేతలకు ఛాతీ నొప్పి వచ్చిందని న్యాయ శాఖ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. దీంతో ఇకపై రాజకీయ నేతలే కాక, ఇతరులెవ్వరైనా తీర్పు విన్న వెంటనే ఛాతీ నొప్పి అంటూ ఆడే నాటకాలకు చెల్లు చీటి ఇచ్చేలా కొత్త నిబంధన తీసుకొచ్చేందుకు ఆ శాఖ వర్గాలు రంగంలోకి దిగాయి.

  • Loading...

More Telugu News