: పాట్నాలో జరిగిన తొక్కిసలాటలో 33కు చేరుకున్న మృతుల సంఖ్య
పాట్నాలోని గాంధీ మైదాన్లో నిన్న జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 33 కు చేరుకుంది. చనిపోయిన వారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. 20మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఈ తొక్కిసలాటలో మరిణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 29మంది గాయపడ్డారు. వారికి పాట్నాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. రావణ దహనం కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రజలందరూ వెనుదిరుగుతున్న సమయంలో, గ్రౌండ్ లో విద్యుత్ తీగలు తెగిపడినట్లు వదంతులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల కుటుంబాలకు బీహార్ ప్రభుత్వం రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. మరోవైపు ఈ దుర్ఘటనపై హోంశాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది.