: వారంలోగా పోలీస్ స్టేషన్లన్నీ శుభ్రంగా ఉండాలి!: రాజ్ నాథ్ సింగ్ ఆదేశం


‘‘పోలీస్ స్టేషన్లు, ఆవరణలు శుభ్రంగా ఉంచండి. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాల్సిందే. వారంలోగా మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ పరిశుభ్రంగా కనిపించాలి’’ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి పంపిన సందేశం సారాంశం. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రధాని మోడీ అక్కడే తొలిసారిగా చీపురు పట్టిన సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్ ను శుభ్రంగా ఉంచుకోవాలంటూ సిబ్బందికి ఆ సందర్భంగా మోడీ సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు పరిశుభ్రతకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా ఢిల్లీ పోలీస్ స్టేషన్లన్నీ చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా కనిపిస్తాయన్న మాట.

  • Loading...

More Telugu News