: కాంగ్రెస్ దుష్పరిపాలనను అంతమొందించండి: ప్రధాని మోడీ


కాంగ్రెస్ దుష్ట పాలనకు చరమ గీతం పాడాలని ప్రధాని నరేంద్ర మోడీ హర్యానా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పాలన తీరుపై మండిపడ్డారు. సమాజంలో మార్పు కోరుకున్నట్టయితే, ప్రభుత్వాలను కూడా మార్చండంటూ ఆయన ఓటర్లను కోరారు. హర్యానాలో సుస్థిర పాలనను కోరుకుంటే, తమకు ఒక్క అవకాశమివ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిందేనన్నారు. హర్యానాలో పండే బాస్మతి ఎగుమతులను కేంద్రం అడ్డుకుంటోందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, సదరు ఎగుమతులపై హుడా సర్కారు 4 శాతం పన్నులు పెంచినందునే ఎగుమతులు తగ్గాయన్న వాస్తవాన్ని సమాధి చేస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News