: ఇక యాపిల్ నుంచి కొత్త ఐపాడ్లు!


ఐఫోన్-6లను యాపిల్ ఇంకా భారత మార్కెట్ లోకి తీసుకునే రాలేదు. అప్పుడే కొత్త తరహా ఐపాడ్ లను ప్రకటించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. గత నెలలో విశ్వవ్యాప్తంగా ఐఫోన్ 6, 6 ప్లస్ లు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా భారీ ఎత్తున ఆర్డర్లు వెల్లువెత్తడంతో, ఇప్పటిదాకా అందిన ఆర్డర్లన్నింటినీ పూర్తి చేసేందుకు ఈ డిసెంబర్ దాకా యాపిల్ రాత్రింబవళ్లు పనిచేయాల్సి ఉంది. అయితే ఈ నెల 16న యాపిల్, కొత్త ఐపాడ్ లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు టెక్నాలజీ వెబ్ సైట్ ‘రీకోడ్’ తెలిపింది. కొత్తగా రానున్న ఐపాడ్ లో ఫాస్టెస్ట్ ప్రాసెసర్ ను యాపిల్ జోడిస్తోందట. ఐపాడ్ లతోనే తొలుత విశ్వవ్యాప్త ప్రాచుర్యం పొందిన యాపిల్, ఆ తర్వాత ఐఫోన్ లతో సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఐపాడ్ ల విక్రయాలు మందగించిన నేపథ్యంలో కొత్త ఐపాడ్ లను ఆవిష్కరించేందుకు యాపిల్ నిర్ణయం తీసుకుందని సదరు వెబ్ సైట్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News