: తిరుమల కపిల తీర్ధంలో కంపుకొడుతున్న నీరు... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
తిరుమలలోని పవిత్ర కపిల తీర్ధం పుష్కరిణిలో నీరు కంపుకొడుతోంది. దీంతో, పుణ్యస్నానాలు చేయకుండానే ఈరోజు భక్తులు వెనుతిరిగారు. తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం మూడో శనివారాన్ని పురస్కరించుకుని కపిల తీర్ధానికి భారీ ఎత్తున తమిళ భక్తులు ఈరోజు పోటెత్తారు. అయితే, నీరు ఏమాత్రం స్నానానికి యోగ్యంగా లేకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందారు. స్నానఘట్టం దగ్గర నీరు మురికిగా ఉండటంపై భక్తులు టీటీడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.